ఈ రోజు నాలుగు తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి..? వాటికి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే అవి ఎంత రన్ టైమ్ తో ఆ మూవీ లు పేక్షకుల ముందుకు రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
మేము ఫేమస్ : ఈ సినిమా ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి ఇతనే దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మళ్లీ పెళ్లి : ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ హీరో గా నటించగా ... సీనియర్ నటి పవిత్ర లోకేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 11 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మేన్ టూ : ఈ మూవీ ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 1 గంట 53 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
2018 మూవీ : ఈ సినిమా ఇప్పటికే మలయాళం లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగు లో ఈ రోజు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో టోవినో థామస్ హీరో గా నటించాడు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.