రెబల్ స్టార్
ప్రభాస్ తాజాగా
ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ...
కృతి సనన్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించింది.
ప్రభాస్ ఈ
మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ...
కృతి సనన్ ఈ
మూవీ లో
సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ
మూవీ ని
జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున
థియేటర్ లలో తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఈ
మూవీ లో
సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ ను మరి కొన్ని రోజుల్లో భారీ ఎత్తున నిర్వహించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ
మూవీ బృందం విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను
జూన్ 6 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ బృందం ఈ
సినిమా యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను
తిరుపతి లో జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూ వీపై
ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో ... ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.