ఆదిపురుష్ ప్రభావం హనుమాన్ పై ఉంటుందా.. డైరెక్టర్ ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో విజువల్ వండర్స్ తో ప్రేక్షకులందరినీ కూడా అబ్బురపరిచే సినిమాలు ఎన్నో విడుదలకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సినిమాలలో అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. పూర్తిగా విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది అని చెప్పాలి. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అయితే ఆది పురుష్ సినిమా విడుదలైన తర్వాత ఇక మరో పురాణ గాధ ప్రేక్షకులు ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  హనుమాన్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిగా జరుగుతూ  విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ హనుమాన్ సినిమాకు సంబంధించి ఇక ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మొదట ఈ సినిమాను తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఆ తర్వాత హిందీలో, తమిళ, కన్నడ భాషలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడ కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత వర్మ.

 ప్రభాస్ ఆది పురుష్ సినిమా ప్రభావం మీ సినిమాపై ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. మేము సినిమా మొదలు పెట్టినప్పుడు ఆది పురుష్  లేదు. అయినా ఒక సినిమా ప్రభావం మరో దానిపై పడుతుందని నేను అనుకోను. సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాం. మా సినిమాకు మొదటి నుంచి మేము అనుకున్న దాని కంటే పది రెట్లు ఎక్కువ స్పందన వస్తుంది. దానికి తగ్గట్లుగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఇక మా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని మాత్రం కచ్చితంగా చెప్పగలను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: