యాంకర్ సుమ పరువు తీసిన రానా..!?

Anilkumar
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .ఆయన నటించిన సినిమాల లో సోలో హీరోగా నటించిన సినిమాల కంటే మల్టీస్టారర్ సినిమాలో మాత్రమే ఆయనకి ఎక్కువ పేరును తెచ్చిపెట్టాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సిరీస్ భీమ్లా నాయక్ వంటి మల్టీ స్టార్ సినిమాలతో ఊహించుని క్రేజ్ ను సంపాదించాడు రానా. విరాటపర్వం సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. పరేషాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా పరేషాన్ మూవీ నటీనటులతో కలిసి సుమషోకి ఇటీవల రావడం జరిగింది. ఇక ఆ షోలో రానా పీల్చిన పంచులు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. 

టాలీవుడ్ హల్క్ అంటూ రానా గురించి సుమ ఇంట్రడక్షన్ ఇవ్వగా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు రానా. పరేషాన్ మూవీ నటీనటులు అయినా తిరువీర్ ప్రణవికరణం దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ కూడా ఈ షోకి వచ్చారు. ఇందులో భాగంగానే స్కూల్ అనగానే మీకు గుర్తుకు వచ్చే విషయాలు ఏంటి అని సుమ వాళ్ళని అడుగుతుంది. ఇందులో భాగంగానే రానా మాట్లాడుతూ యూనిఫామ్ ప్రిన్సిపాల్ ఎగ్జామ్స్ బ్లాక్ బోర్డ్ బుక్స్ ప్లే గ్రౌండ్ అని సమాధానం చెబుతాడు. ఇక ఆ తర్వాత ఈ స్కూల్ మా స్కూల్ కాదని చెప్పడం తో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అనంతరం సుమ మాట్లాడుతూ ఎందుకండి నా చెవులు పనిచేయవని అనుకుంటున్నారా అంటూ రానాతో మాట్లాడుతుంది.

ఇక ఆ తర్వాత సుమా స్క్రీన్ పై ఒక ఫోటో చూపించగానే వెంకటేష్ అని అంటాడు రానా.. డౌట్ వచ్చి టక్కునే చెప్పానని కాకపోతే ఎడిటింగ కట్ కావాలంటే మీ షోలో ఇచ్చిన డబ్బులు ఇస్తాను అంటూ చెప్పడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఇక ఆ తర్వాత ఎవరితో స్నేహం ఎక్కువ కాలం ఉంటుందని అడుగుతుంది సుమ. అనంతరం రామా మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితులతో అని సమాధానం చెప్పి ప్రణవి రెండు లక్షలు బెట్టు పెట్టగా ఆ సమాధానం రైట్ కాదని 500 రూపాయలు పెడతానని చెప్పాడు రానా. ఇప్పటివరకు ఈ షో లో 500 ఎవరూ పెట్టలేదని పట్టుకోవడానికి కూడా నాకు చాలా నామోషీగా ఉంది అంటూ చెబుతోంది సుమా. అయితే పట్టుకోకండి కిందపెట్టేయండి అంటూ చెప్తాడు రానా.. ఇక ఈ షో మొదలైనప్పటినుండి చివరి వరకు సుమా పై పంచులు వేస్తూనే ఉంటాడు రానా. దీంతో రానా సుమపై వేసిన పంచులు కాస్త కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: