తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది .ప్రస్తుతం ఇది ముగింపు దశకు వచ్చింది. గత సీజన్ మంచి హిట్ అవడంతో సీజన్ 2 లో ఎవరో గెలుస్తారని ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ఫినాలే ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రావడం జరిగింది.ఈ క్రమంలో ఈ షో లో భాగంగా అల్లు అర్జున్ ఈ షోలోని కంటెస్టెంట్లతో చాలా సరదాగా గడిపారు. తనకు సంబంధించిన చాలా విషయాలను కంటెస్టెంట్లతో పంచుకున్నాడు అల్లు అర్జున్ .ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును కూడా చెప్పడం జరిగింది.
కంటెస్టెడ్ శృతి ఒక పాట పాడటంతో.. నాకు ఎంతో ఇష్టం అని..తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతినే అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు అల్లు అర్జున్. ఇక ఇందులో భాగంగా గీత మాధురి గర్ల్ ఫ్రెండ్ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలో నా అని అనడంతో వేదిక అంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ.. నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు నాకు అన్ని ఇచ్చి నాకు కనిపించే దేవుడు మీ నాన్న ఆయనే నాకు దేవుడు అంటూ ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్.
దీంతో అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అనంతరం పుష్పా సినిమాలో , కేశవగా అలరించిన నటుడు జగదీష్ తన సినిమా ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ జగదీష్ కి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది .నువ్వు హీరోగా సత్తి గాని రెండెకరాలు చేశావు కదా అని పుష్పటులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని అంటే కుదరదు నువ్వు మాకు కేశవనే.. త్వరగా షూటింగ్ కు వచ్చే మేము అందరం ఎదురు చూస్తున్నాం.. అంటూ కేశవ తో మాట్లాడాడు. అంతేకాదు ఈ షాలో భాగంగా అల్లు అర్జున్ ఈ షో లొంజ్ కంటెస్టెంట్లకు చిన్న చిన్న బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది ..!!