'NBK108' టైటిల్ అదిరిపోయిందిగా..!!

Anilkumar
ఈ ఏడాది ఆరంభంలో 'వీరసింహారెడ్డి' తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల మరో కీలక పాత్ర పోషిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య 'భగవంత్ లాల్ కేసరి' అనే ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. 

అంతేకాదు ఇదే పేరుని సినిమా టైటిల్ గా కూడా నిర్ణయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీకి 'భగవంత్ లాల్ కేసరి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త కాస్త వైరల్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. అంతే కాదు ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.

ఇప్పటివరకు అనిల్ రావిపూడి తన సినిమాలో కామెడీకి ఎక్కువ స్కోప్ ఇచ్చాడు. కానీ మొదటిసారి తన జోనర్ పక్కన పెట్టి ఈ సినిమాలో బాలయ్యను పవర్ఫుల్ గా చూపించబోతున్నాడట. ఈ క్రమంలోనే ఆయన పాత్ర పేరు, గెటప్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన అనిల్ రావిపూడి 'భగవంత్ లాల్ కేసరి' అనే పవర్ఫుల్ పేరును బాలయ్య పాత్రకు పెట్టి దాన్ని సినిమా టైటిల్ గా కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడుగా కూడా కనిపిస్తారట. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ అగ్ర నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: