నాచురల్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక నాచురల్ బ్యూటీగా తనకున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆమె చేసిన ఏ సినిమాలో కూడా ఎలాంటి గ్లామర్ ఎక్స్పోజింగ్ చేయలేదు సాయి పల్లవి.ఇక అలా ఆమె చేసిన సినిమాల్లో గ్లామర్ ఎక్స్పోజింగ్ చేయకుండా సినిమాల్లో నటించడం అంటే అంత సులువైన పని కాదు. కానీ అది కేవలం సాయి పల్లవి కి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి .అయితే సాయి పల్లవి ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం పెద్దగా నటించలేదు.
దీని అర్థం ఆమెకి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం రాలేదు అని కాదు. ఆ సినిమాల్లో తన పాత్ర నచ్చకపోవడంతో స్టార్ హీరోలో సినిమాల్లో సైతం నటించలేదు సాయి పల్లవి. ఇక్కడే అర్థమవుతుంది సాయి పల్లవికి ఇమేజ్ కన్నా తనకు నచ్చిన పాత్ర చేయడం అంటేనే ఇష్టమని. అయితే గత కొంతకాలంగా ఈమె ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమె చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కనీసం మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఇక గతంలో ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఊహించని విధంగా ఫ్లాకులుగా నిలచాయి.
దీంతో డిప్రెస్ అయిన సాయి పల్లవి మరొక సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సాయి పల్లవి.. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ... సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి.. కానీ నావల్ల కొందరు నిర్మాతలు అప్పలపాలవుతున్నారు.. అది నాకు ఇష్టం లేదు ..అయినప్పటికీ వారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు... కానీ నేను మాత్రం వారిని ఇబ్బంది పెట్టను.. వారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను.. అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. దీంతో సాయి పల్లవి ఇన్ని రోజులు సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటనేది తెలిసింది ..!!