నంది అవార్డ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకటేష్..!?

Anilkumar
సాధారణంగా ఏదో ఒక సందర్భంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు నటులు నంది అవార్డ్స్ గురించి మాట్లాడతారు. కానీ తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. స్టేట్ గవర్నమెంట్ నుండి ఇచ్చే ఈ అవార్డ్స్ ని సినిమా ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ చాలా గౌరవంగా భావిస్తారు. ఇక అలాంటి నంది అవార్డ్స్ ని రెండో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2016 నుండి ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ అవార్డ్స్ గురించి చాలామంది సినిమా ఆర్టిస్టులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ సైతం నంది అవార్డ్స్ పై కొన్ని సంచలన కామెంట్లను చేయడం జరిగింది. 

అయితే తన అన్న నరేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వస్తున్న సినిమా అహింస. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్మీట్ ని నిర్వహించడం జరిగింది. ఇక అందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు విక్టరీ వెంకటేష్ .ఇందులో భాగంగానే ఆయన నంది అవార్డ్స్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలను చేయడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించిన.. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చా లేదంటే లేదు.. కానీ అలాంటి అవార్డులు వస్తే మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది..

కానీ ఇప్పుడు ఎందుకు ఆపేసారో అన్నది ఎవరికీ తెలియదు.. అది వాళ్ళ ఇష్టం..అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించిన వెంకటేష్ ఇప్పుడు అవార్డ్స్ పై స్పందించడంతో ఈ వార్త కాస్త ఎప్పుడో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందే ఈ నంది అవార్డ్స్ విషయంపై గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు, సీనియర్ నిర్మాతలు అశ్విన్దత్, ఆదిశేషగిరిరావు, సి కళ్యాణ్ వంటి వారు స్పందించడంతో ఆ వార్తలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇంతమంది నంది అవార్డ్స్ పై స్పందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాలపై స్పందించడం లేదు !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: