మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు. మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలలో జంటగా నటించారు వీరిద్దరూ. అయితే ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒకటవబోతున్నారు. కొన్నేళ్ల క్రితం నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు ఒక్కటి అవ్వాలని ఫిక్స్ అయ్యారు .ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్ డేట్ ని కూడా లాక్ చేశారు. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగబోతుంది. కాగా ఈ ఏడాది చివర్లో వీరిద్దరి వివాహం కూడా ఉండబోతుంది. అయితే నిజానికి గతేడాదే మీ ఇద్దరికీ పెళ్లి జరగాల్సిందట. కానీ నిహారిక కారణంగా లావణ్య ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది .లావణ్య త్రిపాఠి కూడా వీరి పెళ్లికి వచ్చింది. అయితే గత కొంతకాలంగా నిహారిక మరియు చైతన్య మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని అంటున్నారు. వ్యక్తిగత విభేదాల వల్ల వీరిద్దరూ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారట. అంతేకాదు త్వరలోనే విడాకులు కూడా తీసుకుపోతున్నారు అని అంటున్నారు. అయితే నిహారిక లావణ్య త్రిపాఠికి కాబోయే ఆడపడుచు. దాంతోపాటు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ కూడా అందుకే నిహారిక కాపురం చెక్క దిద్దిన తర్వాతే వరుణ్ తేజ్ తో పెళ్లి చేసుకుంటానని చెప్పిందట.
లావణ్య అంతేకాదు ఇప్పటివరకు నిహారిక మరియు చైతన్యని కలిపే ప్రయత్నాలు కూడా చేస్తోందట. కానీ ఆమె ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు పెళ్లి చేసుకోకుండా ఏడాది కాలం పాటు నిహారిక కోసం త్యాగం చేస్తూ వస్తున్నప్పటికీ దానికి ప్రయోగం లేకుండా పోయింది. చేసేదేమీ లేక వరంతో పెళ్లికి రెడీ అయింది లావణ్య త్రిపాటి .దీంతో తన కాబోయే ఆడపడుచు నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత కాలంగా చేస్తున్న త్యాగం చూసి లావణ్య త్రిపాఠి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నేటిజన్స్. దీంతో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!