మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో డింపుల్ హయాతి
హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ
మూవీ లో కీలక పాత్రలలో నటించారు.
శ్రీ వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకు గోపీచంద్ ...
శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం , లౌక్యం అనే రెండు
మూవీ లు రూపొంది ఆ
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ
సినిమా కావడంతో రామబాణం
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు 14.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
సినిమా 15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో భారీ కలక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో విఫలం అయింది. మరి ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం. ఈ
మూవీ టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ లో నైజాం ఏరియాలో 1.23 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 60 లక్షలు , యూఏ లో 47 లక్షలు , ఈస్ట్ లో 36 లక్షలు , వేస్ట్ లో 21 లక్షలు , గుంటూరు లో 30 లక్షలు , కృష్ణ లో 32 లక్షలు , నెల్లూరు లో 18 లక్షలు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ
సినిమా ఫైనల్
బాక్స్ ఆఫీస్ రనుగిసే సారికి 3.67 కోట్ల షేర్ ... 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది.
అలాగే కర్ణాటక , రెస్ట్ ఆఫ్
ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ
మూవీ ఫైనల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 23 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫైనల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3.90 కోట్ల షేర్ ... 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు 11.30 కోట్ల నష్టాలు వచ్చాయి. దానితో ఈ
మూవీ భారీ డిజాస్టర్ ను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.