మహేష్ గుంటూరు కారంని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో?
ఇదిలా ఉంటే ఈ మూవీని ముందుగా త్రివిక్రమ్ మరో హీరో కోసం అనుకున్నారంటు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. గుంటూరు కారం ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని అనుకున్నారట త్రివిక్రమ్. కానీ తారక్ వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో మహేష్ తో ఈ సినిమా చేస్తున్నారంటూ ఓ వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రివిక్రమ్ గుంటూరు కారం కథను మహేష్ కోసమే రెడీ చేశాడని అంటున్నారు పలువురు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ తో కలిసి అరవింద సమేత అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తారక్ తో గురూజీ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నారు.