పవన్ కళ్యాణ్ ఒక గొప్ప వ్యక్తి ఆయన చేసిన సినిమాలు ఆయన చేసిన సేవ కార్యక్రమాలు చూస్తే అర్ధం అవుతుంది.కానీ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమా ల విషయంలో ఈ మధ్య కొంత కన్ఫ్యూషన్ ఏర్పడింది. అస్సలు లైనప్ అంటే ఏ సినిమా తర్వాత ఏది అనే ఓ లెక్క అయితే ఉంటుంది. దానికి పెద్ద గా కౌంట్లు ఏమీ అయితే ఉండవు. ఏది ముందు మొదలుపెడితే అది ముందు పూర్తయి విడుదలవుతుందని తెలుస్తుంది.ఆ తర్వాత మరో సినిమా మొదలవుతుంది.అయితే పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా కొత్తగా ఉంది . ఎప్పుడో మొదలుపెట్టిన సినిమా అలా పక్కనే ఉండి ఆ తర్వాత మొదలైన సినిమాలు అన్నీ పూర్తయి విడుదలైపోతున్నాయి.
‘హరి హర వీర మల్లు’సినిమా విషయంలో అదే జరుగుతుంది.చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ నే వస్తోంది. తాజాగా జూన్ రెండో వారంలో షూటింగ్ అని అన్నారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’షూటింగ్ మొదలైంది. మూడో షెడ్యూల్ స్టార్ట్ చేశాం అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ కూడా చేసింది. దీంతో ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు మొదలయ్యాయని సమాచారం.నిన్న మొన్నటి వరకు ‘బ్రో’ సినిమాకు వరుసగా కాల్షీట్లు కేటాయించాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకు అదే విధంగా కాల్షీట్లను ఇస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పట్నుండి పవన్ కల్యాణ్ గ్యాప్ మాత్రం ఇవ్వడం లేదు. ఫస్ట్ షెడ్యూల్ ముంబయి, పుణె పరిసర ప్రాంతాల్లో అయితే జరిగింది. లెక్కప్రకారం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్లో పవన్ జాయిన్ అవ్వాల్సింది.. పోనీ ఆ తర్వాతైనా షూటింగ్ ఉంటుందా అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ అయితే ఉంటుంది అంటున్నారు. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ కూడా నటిస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.. ‘హరి హర వీరమల్లు’ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం.