అందుకే ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేశా అంటున్న శ్రియ.!
అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా చలామణి అయిన ఈమె అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. అందరి హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న అవకాశం వస్తే కాదని రిజెక్ట్ చేసిందట. ఇక ఆ హీరో ఎవరు ఎందుకు ఆయనతో నటించలేదు అనే విషయానికి వస్తే.. ఆ హీరోతో నటించే అవకాశం వచ్చినా సరే ఆమె కావాలని రిజెక్ట్ చేసిందని అందుకు ప్రధాన కారణం ఆ హీరో శ్రియా కంటే పొట్టిగా ఉండడమే నట.. హీరో పొట్టిగా ఉన్న కారణంతో తెరపై వీరిద్దరూ కలిసి నటిస్తే అక్క తమ్ముడు గా కనిపిస్తారని, అందుకే ఆ హీరోతో కలిసి నటించడానికి ఇష్టపడలేదని ఆ రీసన్ తప్పితే ఆ హీరో నటించకపోవడానికి మరో కారణం ఏమీ లేదు అంటూ దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ ఇచ్చిందట.
దీంతో మరొకసారి శ్రియ పేరు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.. ఇక పోతే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది అలాగే తన గ్లామర్ ఫోటోషూట్లను నిత్యం షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. మొత్తానికి అయితే శ్రియ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.