పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాదేశ్యామ్' వంటి డిజాస్టర్ మూవీనీ తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ కి ఎట్టకేలకు ఓ హీరో దొరికేసాడట. తాజాగా తన లేటెస్ట్ మూవీ ని ఆ హీరో తోనే చేయబోతున్నట్లు సమాచారం. ఓ కోలీవుడ్ అగ్ర హీరోతో రాధాకృష్ణ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ గత ఏడాది ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు.
రొటీన్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే హీరోయిజం, యాక్షన్ సీన్స్ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. నిర్మాతలకు కూడా ఈ సినిమా వందల కోట్ల నష్టాలను మిగిల్చింది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ 150 కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. దీంతో గత ఏడాది నిర్మాతలకు అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా రాదే శ్యామ్ నిలిచింది. ఇక ఈ డిజాస్టర్ తో సుమారు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న రాధాకృష్ణ త్వరలోనే తన నెక్స్ట్ మూవీ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ తో ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడట.
యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై రెస్పాన్స్ ని అందుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ కి జోడిగా రీతు వర్మ హీరోయిన్గా నటిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.