పవన్ కళ్యాణ్ ను మోసం చేసిన స్టార్ నటి....!!
ప్రసుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో బ్రో ది అవతార్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉంది, వచ్చే నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ ఐటెం సాంగ్ లో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతుల పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆడిపాడనుండి.ఈమెకి ముందు మూవీ టీం పలువురి హీరోయిన్స్ కోసం ప్రయత్నాలు చేసింది.వారిలో శ్రీలీల మరియు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు.శ్రీలీల కి డేట్స్ సర్దుబాటు కాక ఈ ఐటెం సాంగ్ కి ఒప్పుకోలేదు, కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఒప్పుకొని డేట్స్ ఇచ్చింది, అంతా మాట్లాడుకున్న తర్వాత షెడ్యూల్ ఫిక్స్ అయ్యాక ఆమె ఈ పాటని నేను చెయ్యలేను అంటూ మొండిచెయ్యి చూపించేసింది.
దీంతో చేసేది ఏమి లేక, అదే షెడ్యూల్ లో అప్పటికప్పుడు ఊర్వశి తో మాట్లాడి ఈ సాంగ్ సెట్ చేసారు.రకుల్ ప్రీత్ సింగ్ లాగ పవన్ కళ్యాణ్ ని ఇంతకు ముందు ఏ హీరోయిన్ కూడా ఇలా మోసం చెయ్యలేదు.రకుల్ గతం లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని అని చెప్పుకుంటూ వచ్చింది, ఆయన పక్కన నటించే అవకాశం వస్తే అది నా అదృష్టం గా భావిస్తాను వంటి భారీ డైలాగులు కొట్టింది.కానీ చివరికి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మొండిచెయ్యి చూపించింది.ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ సర్దుబాటు చెయ్యలేని రేంజ్ బిజీ గా అయితే అసలు లేదు.ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క క్రేజీ సినిమా కూడా లేదు, అలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆమె తలబిరుసు చూపించడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చాలా తీవ్రంగా ఆమె పై విరుచుకుపడుతున్నారు.