అదితీరావ్ హైదరితో డేటింగ్ పై.. క్లూ ఇచ్చేసిన సిద్ధార్థ్?
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం సిద్ధార్థ్ బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక సిద్ధార్థ్ ఏ షోకి వెళ్లిన.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ అదితి రావు హైదరితో డేటింగ్ విషయంపైనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో మహాసముద్రం అనే సినిమాలో కలిసి నటించారు అదితి రావు హైదరి, సిద్ధార్థ్. ఇక ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయింది. గత కొన్నాళ్ల నుంచి వీరిద్దరు చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. శర్వానంద్ పెళ్లిలో కూడా ఇద్దరూ కలిసి హాజరయ్యారు.
దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అని అందరికీ అర్థం అయిపోయింది. అయితే వీరిద్దరూ ఎక్కడ ప్రేమ విషయం గురించి నోరు విప్పక పోయినప్పటికీ సిద్ధార్థ్ అదితి రావు హైదరి ప్రేమ విషయం మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. అయితే ఇటీవలే ఒక టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ హీరోయిన్ అదితి తో ఉన్న డేటింగ్ గురించి ఇన్ డైరెక్టుగా క్లారిటీ ఇచ్చాడు. జీవితాంతం మీతో కలిసి డాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా అంటూ యాంకర్ శ్రీముఖి ప్రశ్నించగా.. మా ఊర్లో అందరూ అదితి దేవోభవ అని అంటారు అంటూ నవ్వుతూ చెప్పేసాడు సిద్ధార్థ్. ఇలా తన జీవితంలో హీరోయిన్ అదితీ రావు హైదరి ఉందని ఇన్ డైరెక్ట్ గా క్లూ ఇచ్చేసాడు.