సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి బిగ్ బి అమితా బచ్చన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ తన కెరియర్ లో ఎక్కువ శాతం తమిళ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే అమితా బచ్చన్ తన కెరియర్ లో ఎక్కువ శాతం హిందీ సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. అది ఏ సినిమా ఆ సినిమాకు ... ఆ మూవీ కి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం. సూర్య హీరోగా రూపొందినటువంటి జై భి మూవీ కి దర్శకత్వం వహించిన టి జే జ్ఞానవేల్ మరికొన్ని రోజుల్లో రజిని ... అమితాబ్ కాంబినేషన్ లో ఒక మూవీ ని రూపొందించబోతున్నాడు.
ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు . ఈ సినిమా షూటింగ్ జూలై నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. ఇలా రజిని ... అమితాబ్ కలిసి నటించబోయే మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచ నాలను నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.