బాలయ్యను మరిచిపోయిన జూనియర్ అసహనంలో అభిమానులు !
ఇలాంటి పరిస్థితుల మధ్య మరొకసారి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య కొనసాగుతున్న గ్యాప్ మరొకసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా జూనియర్ బాలయ్యల మధ్య కనిపించని ఓకే గ్యాప్ కొనసాగుతోంది అన్న విషయం అందరికీ ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఇలాంటి గ్యాప్ ఎందుకు ఏర్పడింది అన్నవిషయమై నందమూరి అభిమానులకు క్లారిటీ లేకపోయినా వారిద్దరూ అభిమానంగా ఒకరిపట్ల ఒకరు ఉండాలని చాలామంది నందమూరి అభిమానుల కోరిక.
ఇప్పటివరకు బాలకృష్ణ ప్రతి పుట్టినరోజునాడు జూనియర్ బాలయ్యకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేసిన సందర్భాలు చాల ఉన్నాయి. అయితే ఈసారి లేటెస్ట్ గా జరిగిన బాలయ్య పుట్టినరోజునాడు తారక్ తన బాబాయికి సోషల్ మీడియాద్వారా శుభాకాంక్షలు తెలపకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందా అంటూ ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.
బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘భగవత్ కేసరి’ టీజర్ పై చాలామంది సెలెబ్రెటీలు తమ అభినందనలు తెలియచేసినా ఈవిషయంలో జూనియర్ మౌనంగా ఉండటం మరింత ఆశ్చర్యానికి నందమూరి అభిమానులను గురిచేస్తోంది. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం తన బాబాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ‘భగవత్ కేసరి’ టీజర్ బాగుంది అంటూ చెప్పడంతో ఎప్పటికైనా బాలయ్య జూనియర్ లను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే సత్తా ఒక కళ్యాణ్ రామ్ కు మాత్రమే ఉంది అంటూ అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనితో రాబోయే ఎన్నికలలో జూనియర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన అభిమానులకు ఎలాంటి పిలుపును ఇస్తాడు లేకుంటే అప్పుడు కూడ మౌనంగానే ఉంటాడా అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు..