ఆది పురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ లెవెల్లో అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. మరి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి నైజాం ఏరియాలో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సీడెడ్ ఏరియాలో ఈ మూవీ కి 17.16 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , యూ ఏ లో 14.15 కోట్లు , ఈస్ట్ లో 8.80 కోట్లు , వేస్ట్ లో 7.20 కోట్లు , గుంటూరు లో 8.60 కోట్లు , కృష్ణ లో 8.50 కోట్లు , నెల్లూరు లో 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతోంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 121 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: