బ్రో సినిమా నుంచి టీజర్ రెడీ..!!

Divya
పవన్ కళ్యాణ్ యంగ్ హీరో సాయి ధరంతేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రంలో నటిస్తూ ఉన్నారు.. మల్టీ స్టారర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. బ్రో చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కూడా రచయితగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తమిళ సూపర్ హిట్ సినిమాని వినోదయ సీతం చిత్రానికి రిమెక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా బ్రో సినిమా గురించి కీలకమైన విషయాలు వెల్లడించారు. బ్రో సినిమా టీజర్ కట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ సముద్రఖని తాజాగా ఇంటర్వ్యూలో తెలియజేస్తూ.. త్వరలోనే టీజర్ను విడుదల చేస్తామని డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని ఫస్టాఫ్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి అయ్యిందని తెలియజేశారు.. సెకండాఫ్ సంబంధించి డబ్బింగ్ వర్క్ కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.. మొత్తానికి బ్రో టీజర్ ఇదే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ సినిమా వచ్చే నెల 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించడం జరిగింది.. పవన్ తో మరొక సినిమా చేస్తారా అని ఇంటర్వ్యూలో అడగగా.. సముద్రఖని ఇందుకు స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ తో 100 సినిమాలైనా చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానంటూ తెలియజేశారు.


అందుకు సంబంధించిన కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చెబితే తాను చేయడానికి సిద్ధమేనని తెలియజేశారు. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.సాయి ధరమ్  తేజ్ కు జోడిగా కేతిక శర్మ నటిస్తూ ఉండగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రోహిణి, సుబ్బరాజు తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు.మరి ఏ మేరకు ఈ సినిమా టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: