ఆదిపురుష్ విషయంలో రాజమౌళి ని పొగిడిన వేణుస్వామి....!!

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను బాహుబలి మూవీ పాన్ ఇండియా హీరోను చేసింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.అందుకు కారణం ప్రభాస్ జాతకమే అని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు, మూవీ హిట్స్ ప్లాప్స్ వంటి విషయాలను వారి జాతకం ప్రకారం చెబుతూ ట్రెండ్ అవుతున్నారు వేణు స్వామి. తాజాగా ఆయన ఎన్నో అంచనాలతో రాబోతున్న ఆదిపురుష్ మూవీ ఫలితం ఎలా ఉండనుందో ముందే చెప్పేసారు.రాముడి కథతో రామాయణం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటించగా.. హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్ని విషయం తెలిసిందే.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ను మొదట్లో ఆదిపురుష్ టీజర్ నిరాశపరిచినా.. ఇటీవల విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకోసం ఆదిపురుష్ రిలీజయ్యే జూన్ 16 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మూవీ రిజల్ట్ చెప్పి పెద్ద బాంబ్ పేల్చారు."ప్రభాస్ జాతకరీత్యా ఆదిపురుష్ సినిమా పెద్ద సంచలన విజయాన్ని అందుకునే అవకాశం అయితే లేదు. బాహుబలి రేంజ్ లో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత హిందుత్వం అయినా.. హిందూ మతానికి సంబంధించిన మూవీ అయినా పెద్ద గొప్పగా ఉండదు. సినిమాలో కంటెంట్ లేకపోతే జనం లైట్ తీసుకుంటారు" అని వేణు స్వామి తెలిపారు.ఇంకా వేణు స్వామి కొనసాగిస్తూ.. "త్రీడీ అని పిల్లలు చూస్తారని అనుకోవడం సరి కాదు. ఎందుకంటే పిల్లలు చూస్తే సినిమా సూపర్ హిట్ అయిపోదు. జాతకం ప్రకారం పొందుకునే యోగం ఉండాలి. ప్రభాస్ కు ఆ యోగం ఇప్పుడు లేదు. ప్రభాస్ అని పేరు చెబితే అన్నీ సూపర్ హిట్స్ అయిపోవాలనే రూల్ లేదు కదా. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఏమయ్యాయి" అని అన్నారు.
"ప్రభాస్ కు ఇప్పుడు డిమాండ్ నడుస్తుంది. సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటాడా.. లేదా.. అనేది ఆయన ఇష్టం. కానీ సినిమా తీసిన తర్వాత రిసీవ్ చేసుకోవాల్సింది జనాలు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. రెండు సినిమాలు వచ్చాయి. రెండు పోయాయి. ఇప్పుడు ఆదిపురుష్ కూడా బీభత్సం అనేట్టుగా అయితే ఉండదు. దానికి కారణం జాతక యోగమే" అని వేణు స్వామి పేర్కొన్నారు."ఇటీవల శాకుంతలం మూవీ వచ్చింది. అదే సినిమా రాజమౌళి తీసి ఉంటే మరో ఆస్కార్ అవార్డ్ వచ్చేది. తీయడంలో తేడా గురించి నేను మాట్లాడటం లేదు. శాకుంతలం చిత్రం దర్శకుడు రాజమౌళి అని వేసి ఉంటే రిజల్ట్ ఎక్కడో ఉండేది. ఎందుకంటే రాజమౌళికి అంత మార్కెటింగ్ కెపాసిటీ ఉంది.
పది పైసలు పెట్టిన దాన్ని వంద రూపాయలకు కన్వర్ట్ చేసే శక్తి రాజమౌళికి ఉంది. ఆయనది అంత బలమైన జాతకం. రాజమౌళి కంటే కొన్నికోట్లు ఎక్కవ పెట్టినా కూడా.. ఆయన సినిమాలు నడిచినట్లు వేరే వాళ్ల సినిమాలు నడవవు. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అంతే" అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: