అమీర్, హృతిక్ లతో సందడి చేసిన బన్నీ?

Purushottham Vinay
పుష్ప మూవీతో కేవలం సౌత్ ఇండియాలో కాదు.. నార్త్ ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో ఉత్తరాదిలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.అల్లు అర్జున్ స్టైల్, యాటిట్యూడ్‏కు బాలీవుడ్ సినీ ప్రియులు అంతా ఎంతగానో ముగ్దులయ్యారు. ఇంకా అంతేకాకుండా.. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం అక్కడి వారు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోస్ అమీర్ ఖాన్, హృతిక్ రోషన్‏లతో కలిసి అల్లు అర్జున్ ఓ పార్టీలో సందడి చేశారు. వీరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఈ ముగ్గురు స్టార్స్ ఒకేచోట చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు వారి ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అయితే మధు మంతెన తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబాయిలో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరగ్గా… ఇందులో బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా.. పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు.


ఈ వేడుకలలో అమీర్ ఖాన్, అనిల్ కపూర్ ఇంకా జాకీష్రాఫ్ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్ వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. స్టైలీష్ లుక్‏లో బన్నీ ఈ వేడుకలలో సందడి చేశారు.తరువాత అక్కడే ఉన్న అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో కరచాలనం చేశారు.ఆ తరువాత వారితో సరదాగా ముచ్చటించారు.ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. బన్నీని చూసిన బాలీవుడ్ స్టార్స్ అప్యాయంగా పలకరించాగా.. కండల వీరుడు హృతిక్ బన్నీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. బన్నీ, హృతిక్ కలిస్తే చూసేందుకు చాలా బాగుందని.. వీరిద్దరు కలిసి నటించడం చూడాలని ఉందంటూ వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: