బోల్డ్ లుక్లో రెచ్చిపోయిన తమన్నా..!!

Divya
టాలీవుడ్ లో మిల్క్ బ్యూటీగా తమన్నా పేరు పొందింది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోని పలు చిత్రాలలో నటిస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన తమన్నాకు ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతున్నది. తమన్నా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఈ మధ్యకాలంలో కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.
తాజాగా తమన్నా హాట్ నెస్ డోస్ పెంచి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బ్లాక్ కలర్ ఫాంట్ టాప్ హార్ట్ షేప్ డిజైన్లు వైట్ కలర్ బ్రాలో కనిపిస్తోంది తమన్నా. బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న ఫోటోలను తమన్న షేర్ చేయడం జరిగింది బాలీవుడ్ లో ఒక అడల్ట్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న నేపథ్యంలోనే తమన్నా మరి ఇంత బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ లవ్ స్టోరీ-2 లో నటిస్తోంది.ఇందుకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే విడుదల కావడం జరిగింది.

ఇందులో కాజోల్, తమన్నా మృణాల్  వంటి హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు. ఈ టీజర్ యువతను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది రొమాంటిక్ సన్నివేశాలలో తమన్నా మరింత బోల్డుగా నటించినట్లు తెలుస్తోంది. యువ నటుడు విజయ్  ఈమెకు జోడీగా కనిపించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు కూడా అందరిని ఆకర్షించే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. పూర్తిగా అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించడం గమనార్హం. ప్రస్తుతం ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇక తమన్నాకు సంబంధించి ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: