ఎట్లయితే గట్లయితది చూసుకుందాం అనుకున్న రవితేజ.. సంక్రాంతికి బిగ్ ఫైట్..!

shami
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఈగల్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ చూస్తే సినిమాపై మంచి ఆసక్తి కలిగించేలా చేసింది. రవితేజ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు.. అదేంటంటే ఆల్రెడీ పొంగల్ రేసులో ఆల్రెడీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఖర్చీఫ్ వేశాడు.

ప్రాజెక్ట్ కె అంటే అది మామూలు సినిమా కాదు. హాలీవుడ్ టెక్నిషియన్స్ తో చేస్తున్న సినిమా. ఇక మరోపక్క మహేష్ గుంటూరు కారం కూడా సంక్రాంతి రేసులో నిలుస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా రవితేజ ఈగల్ కూడా పోటీకి వస్తుంది. రవితేజ పోటీకి రావడం వల్ల ఆ రెండు సినిమాల కన్నా ఆ రెండు సినిమాల వల్ల రవితేజకి బాగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. అయినా కూడా పెద్ద సినిమాలు వస్తున్నాయని తెలిసినా పొంగల్ కి సినిమా వదలాలని అనుకున్నారు అంటే సినిమాలో కచ్చితంగా గట్టి విషయం ఉండి ఉంటుంది.

మొత్తానికి రవితేజ పొంగల్ ఫైట్ కి షురూ అంటున్నాడు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మహేష్ గుంటూరు కారం రెండు సినిమాలు రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఒకవేళ రిలీజ్ టైం కి రవితేజ సినిమానే వాయిదా పడొచ్చేమో కానీ వచ్చే సంక్రాంతికి మహేష్ ప్రభాస్ ఫైట్ మాత్రం పకా ఉండి తీరుతుంది. ఈ సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది అన్నది చూడాలి. మరి ఈ మూడు సినిమాలతోనే సంక్రాంతి ఫైట్ ఆపేస్తారా లేదా మరి కొన్ని సినిమాలు షెడ్యూల్ చేస్తారా అన్నది కూడా తెలియాల్సి .




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: