రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరిగా నటించిన మూడు మూవీ లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా ... అనుష్క ... తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. దగ్గుపాటి రానా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... రమ్యకృష్ణ , నాజర్ , సత్యరాజ్ ఈ మూవీ లో ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
సాహో : ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించగా ... యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 67 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
ఇలా ప్రభాస్ ఆఖరిగా నటించిన 3 మూవీ లు కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ సాలీడు కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. మరి తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.