మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా....?

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB29 . దర్శక ధీరుడు రాజమౌళి  ఈ చిత్రానికి దర్శకుడు, ఎప్పుడో 14 ఏళ్ళ క్రితమే వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది.కానీ రాజమౌళి తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, మహేష్ బాబు కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం వల్ల , ఈ క్రేజీ కాంబినేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రాజమౌళి పాన్ వరల్డ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత మహేష్ బాబు సినిమా చెయ్యబోతున్నాడు. అభిమానులకు ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంది. KS రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. తారాగణం కూడా పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఉండబోతుంది. రాజమౌళి ఇన్ని రోజులు తన సినిమాల కోసం పాన్ ఇండియన్ మార్కెట్ లో ప్రొమోషన్స్ చేసుకునే వాడు, మహేష్ బాబు చిత్రానికి పాన్ వరల్డ్ రేంజ్ లో మీడియా ముందు ప్రొమోషన్స్ లో కూర్చోబోతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఆగష్టు 9 వ తారీఖున సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ - రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతుందట. మరో సర్ప్రైజ్ ఏమిటంటే అదే రోజు ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని కూడా విడుదల చెయ్యబోతున్నారట.రాజమౌళి కి తన ప్రతి సినిమా ప్రారంభానికి ముందు కథ మొత్తాన్ని చెప్పడం అలవాటు. ఈ సినిమాకి కూడా అదే చెయ్యబోతున్నాడు అట,ఈ చిత్రం థీమ్ ఏమిటి?, స్టోరీ ఎలా ఉండబోతుంది?, ఇలాంటివి అన్నీ కవర్ చేస్తూ ఈ వీడియో ని సిద్ధం చేశారట. మహేష్ పుట్టిన రోజు నాడు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ వీడియో ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట, కీరవాణి అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే బ్యాలనే ఉందట. ఈ చిత్రాన్ని యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మలచబోతున్నారని రాజమౌళి ఇది వరకే అధికారికంగా తెలిపాడు. ఉదాహరణకి 'ఇండియానా జోన్స్' అనే సినిమాని తీసుకోవచ్చు. ఆ విధంగానే ఈ సినిమా ఉండబోతుందట, ఎవరైనా ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే టోరెంట్స్ లో డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ చిత్రాన్ని మూడు భాగాల్లో తియ్యబోతున్నారని టాక్, ఇప్పటికే హీరోయిన్ గా 'దీపికా పడుకొనే' ఖారారు అయ్యింది. రీసెంట్ గా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ఇది చెప్పుకొచ్చింది,ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నానని, ఈ సినిమా తర్వాత వెంటనే మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించబోతున్నాడని టాక్ నడిచింది, ఇందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: