తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరోలలో నితిన్ ఒకరు. ఈయన ఆఖరుగా
మాచర్ల నియోజక వర్గం అనే సినిమాలో హీరోగా నటించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ
సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఈ
మూవీ కి ఎం ఎస్
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఈ
మూవీ లో నితిన్ సరసన కృతి శెట్టి
హీరోయిన్ గా నటించింది. ఇలా
మాచర్ల నియోజక వర్గం
మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ఈ
యువ హీరో ప్రస్తుతం
వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ సెట్స్ పై ఉండగానే నితిన్ ...
వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోయే
మూవీ లో
హీరో గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
రష్మిక మందన
హీరోయిన్ గా నటించబోతోంది. ఇది వరకే నితిన్ ...
రష్మిక మందన ...
వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ అనే
మూవీ రూపొంది మంచి విజయం సాధించింది. దానితో విరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నిలకోని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... నితిన్ ... వెంకి కాంబినేషన్ లో రూపొందిన
సినిమా అడ్వెంచర్ జోనర్ లో ఉండబోతున్నట్లు అందులో
వెంకీ తన మార్క్ కామెడీతో ఈ సినిమాను నింపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్
కుమార్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.