ఆదిపురుష్: ఫస్ట్ డే 100 కోట్ల వసూళ్లు పక్కా?
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ సత్తా ఏంటో మరోసారి అందరికి తెలిసే సమయం వచ్చింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం అనేది చాలా చిన్న విషయంగా తెలుస్తుంది. భారత దేశ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు మొదటిరోజే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి.'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2', 'సాహో', '2.0', 'పఠాన్' సినిమాలు మాత్రమే ఇప్పటిదాకా ఆ ఫీట్ ని సాధించాయి.
ఇప్పటికే 'బాహుబలి-2', 'సాహో' వంటి పాన్ ఇండియా సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్.. ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాతో కూడా మరోసారి ఆ ఫీట్ ని సాధించడం ఖాయమనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఏకంగా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ప్రభాస్ కి ఉంది.ఇంకా కర్ణాటక సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆదిపురుష్ సినిమాపై చాలా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కి అంచనాలకు మించిన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' ని మించేలా ఓపెనింగ్స్ రాబట్టేలా ఉంది. ప్రభాస్ కి ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన 'ఆదిపురుష్' సినిమా మొదటిరోజు ఖచ్చితంగా వంద కోట్ల గ్రాస్ రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు.