పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస
మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ తమిళం లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందినటువంటి వినోదయ సీతం అనే
మూవీ ని తెలుగు లో
రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో
సుప్రీమ్ హీరో
సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటిస్తూ ఉండగా ...
తమిళ్ ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి
సముద్ర ఖని ఈ తెలుగు
రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే పవన్ ఈ
సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. అలాగే తనకు సంబంధించిన మేజర్ షూటింగ్ భాగాన్ని కూడా కొంత కాలం క్రితమే పవన్ పూర్తి చేసుకున్నాడు.
కాకపోతే ఈ
మూవీ లో పవన్ కు సంబంధించిన ఒక పాట మరియు ఫైట్ సన్నివేశాలు ఎన్ని రోజుల పాటు చిత్ర బృందం బ్యాలెన్స్ లో ఉంచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాలో పవన్ పాల్గొన్న పాట మరియు ఫైట్ సన్నివేశాలను కూడా తాజాగా పూర్తి చేసింది. దీనితో "బ్రో"
మూవీ కి సంబంధించిన పవన్ భాగం షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాను జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది. ఈ
మూవీ లో పవన్ ... సాయి తేజ్ కలిసి నటించడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ బృందం తాజాగా ఒక ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించింది.
ఈ ఐటమ్ సాంగ్ లో
ఊర్వశి రౌతేల నటించింది. ఇది ఇలా ఉంటే
అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ తిరిగి వకీల్ సాబ్
మూవీ తో
సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తావత భీమ్లా
నాయక్ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. మరి "బ్రో"
మూవీ తో పవన్ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.