టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క గత కొంతకాలంగా సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. వెండితెరపై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్టు ఉంది అదే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనుష్క జంటగా నటిస్తున్నారు.
దాదాపుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయి త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకుముందు వరకు చేతిలో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండే అనుష్క ఇప్పుడు మాత్రం సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించడం వెనక ఒక బలమైన కారణమే ఉందని తెలుస్తుంది.అయితే కొందరు డైరెక్టర్లు పెట్టిన టార్చర్ వల్ల అనుష్క సినిమాలను చేయడం పూర్తిగా మానేసింది అన్న వార్తలు వినబడుతున్నాయి .ఇక బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భాగమతి నిశ్శబ్దం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మెరిసింది అనుష్క.
అయితే ఇలా ఆమె వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడంతో ఆమెకి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందేమో అన్న సందేహంతో ఒక స్టార్ డైరెక్టర్ ఆమెని లేడీ ఓరియంటెడ్ కథలతో అనుష్కని తరచుగా ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. పేరు ఉన్న దర్శకులు సైతం అనుష్కకి అలాంటి కధలే చెప్పడంతో అనుష్క ఈ కథలను విని బాగా విసిగిపోయిందట. మొదట్లో ఓపికగానే ఉన్నప్పటికీ రాను రాను వారి టార్చర్ తట్టుకోలేక వారి నుండి తప్పించుకోవడం మొదలు పెట్టిందట. తాజాగా ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం లేదట. ఇది ఒకటే కాకుండా మరొక కారణం కూడా ఉంది. అయితే ఒకవైపు ఈ టార్చర్ మరోవైపు ఇంట్లో తన పెళ్లి పై ఎప్పటినుండో ఒత్తిడి చేయడంతో సినిమాలను చేయడం మానేసి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉందట అనుష్క..!!