ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హోదాను అందుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది.టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రైస్తో బాలీవుడ్కు వెళ్ళిపోయింది రకుల్ .టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి బాలీవుడ్కు మకామ్ మార్చింది. అయితే గత ఎడాది ఏకంగా ఒకేసారి ఐదు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది ఈ చిన్నది. కానీ ఐదు సినిమాలకు గాను నిరాశే ఈమెకి ఎదురైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారింది రకుల్ ప్రీత్ సింగ్.
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో ఐ లవ్ యు సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమాలో పావెల్ గులాటి హీరోగా నటిస్తున్నారు. నిఖిల్ మహారాజన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా నేరుగా ఓటీడీలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ సినిమా కోసం రకూల్ తన ప్రాణాలని ప్రాణంగా పెట్టింది అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో నీటి అడుగున కొన్ని సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఆ సీన్ల కోసం రకుల్ ప్రీత్ సింగ్ చాలా కష్టపడిందట. కొన్ని సన్నివేశాల్లో ఏకంగా రెండు నిమిషాల 30 సెకండ్లు నీటి అడుగున గాలి కూడా పీల్చుకోకుండా ఉందట. అంతేకాదు దాదాపుగా ఈ సీను చిత్రీకరించి సమయంలో 14 గంటలు నీటిలోనే ఉందట రకుల్ .ఇందుకోసం చాలా రిస్క్ చేసిందట ఈమె. ప్రస్తుతం వాటికి సంబంధించిన వీడియోలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఈ వీడియో ఫోటోలు చూసి నేను నెటిజన్స సినిమాల పట్ల ఆమెకి ఉన్న డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు ఆ వీడియోలను చూసిన నెటిజెన్స్ రకుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ..!!