పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన..!?

Anilkumar
రామ్ చరణ్ ఉపాసన దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి కొన్ని రోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఉపాసనకి నెలలు దగ్గరపడ్డాయి. దీంతో రాంచరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఇది వారి 10 ఏళ్ల కళ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2012లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించే ఘనంగా  పెళ్లి చేసుకున్నారు. కాగా 2022 డిసెంబర్లో మెగాస్టార్ చిరంజీవి ఈ గుడ్ న్యూస్  సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.


 ఇక అప్పట్లో ఈ వార్త ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా వారసుడు వస్తాడు అన్న వారు సంబరాలు చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల మధ్య ఉపాసన సీమంతం వేడుకలు నిర్వహించారు మెగా కుటుంబం. అయితే ఈ క్రమంలోనే ఉపాసనకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే డెలివరీకి సమయం దగ్గర పడుతుండడంతో ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఆమె పుట్టపోయే బిడ్డ కోసం కార్డ్ బ్లడ్ భద్రపరుచుకోబోతుందట ఉపాసన.


 భవిష్యత్తులో బిడ్డకు ఏమైనా సమస్య వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు.అవసరమైనప్పుడు కార్డు బ్లడ్ వాడి బిడ్డను  రోగాల నుండి కాపాడవచ్చు.అయితే ఈ విధానాన్ని స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇటీవల ఉపాసర ఈ ప్రకటన  చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఇక పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనకూడదని అప్పుడే నిర్ణయించుకుందట ఉపాసన.తాజాగా ఈ విషయంలో కుటుంబ సభ్యులు సమాజం నుండి ఎలాంటి ఒత్తిడి ఎదురైనా కూడా వెనుకడుగు వేయకుండా మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చింది ఉపాసన. దీంతో ఉపసన చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: