టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇక పవన్
కళ్యాణ్ సినిమాల్లో మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆయన సినిమాలు ప్లాప్ అవ్వచ్చు ఏమో కానీ, ఆ సినిమాల్లోని పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన సినిమాలోని పాటలకు
సినిమా రిజల్ట్ తో ఎటువంటి సంబంధం ఉండదు. అలా పవన్
కళ్యాణ్ కెరియర్ లో మ్యూజికల్ హిట్గా నిలిచిన చిత్రం 'గుడుంబా శంకర్'. అంతేకాదు పవన్
కళ్యాణ్ క్రేజ్ ను పెంచిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.
2004లో విడుదలైన ఈ
సినిమా కమర్షియల్ గా
సక్సెస్ కాలేకపోయినా సినిమాలో పవన్
కళ్యాణ్ స్టైల్, ఆటిట్యూడ్, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మెలోడీ బ్రహ్మ
మణిశర్మ సంగీతమందించిన ఈ
సినిమా పాటలు అప్పట్లో
ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ఇప్పటికి కూడా ఈ పాటలకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. అయితే తాజాగా ఈ
సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మణిశర్మ. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఆల్బమ్స్ లో
గుడుంబా శంకర్ బెస్ట్ ఆల్బమ్ అని చెప్పారు. అయితే ఈ సాంగ్స్ క్రెడిట్ మొత్తం పవన్
కళ్యాణ్ దే అని అన్నారు మణిశర్మ.
ఎందుకంటే ఈ
సినిమా మ్యూజిక్ విషయంలో పవన్
కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఈ మ్యూజిక్ హిట్ అవడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని తెలిపారు. రాత్రి, పగలు రికార్డింగ్ రూమ్ లో కూర్చుని చిన్న చిన్న సీన్స్ కూడా అడిగి మరీ మ్యూజిక్ కంపోజ్ చేయించుకునే వారిని తెలిపారు మణిశర్మ. దీంతో
మణిశర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం పవన్
కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..
సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి నటిస్తున్న 'బ్రో'
మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. జూలై 28న
మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, ఓ జి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్...!!