అందుకే బాహుబలి సినిమాలో నాకు గుర్తింపు రాలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అటు ప్రభాస్ కి ఇటు రానాకి పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.." బాహుబలి లాంటి సినిమాల వల్ల హీరోలకే ఎక్కువగా గుర్తింపు వస్తుందని నా అభిప్రాయం. 


అందుకే ఈ సినిమాతో ప్రభాస్, రానా గ్లోబల్ వైడ్ గా సక్సెస్ అయ్యారు. ఇక సినిమాలో నటించిన అనుష్క, రమ్యకృష్ణ లకు కొంత పేరు వచ్చినా, నా పాత్ర మాత్రం కేవలం అతిధి పాత్రగానే మిగిలిపోయింది. అందుకే నాకు తగిన గుర్తింపు రాలేదు. నిజానికి ఈ సినిమా కోసం ప్రభాస్, రానా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వాళ్లు గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు అందుకోవడానికి అర్హులు" అంటూ చెబుతూ బాహుబలి సక్సెస్ ను తాను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయినట్లు తెలిపింది తమన్నా. అయితే బాహుబలిలో తన పాత్ర చిన్నదే అయినా అది చాలా కీలకమైందని, అంతేకాకుండా ఆ పాత్ర ప్రేక్షకులకు ఎంతో నచ్చిందని ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.


ఇక రెండు భాగాలు తెరకెక్కిన బాహుబలి సినిమాలో మొదటి భాగంలో పోరాట యోధురాలిగా తమన్నా ఆకట్టుకోగా.. రెండో భాగంలో మాత్రం కేవలం అతిధి పాత్రతోనే సరిపెట్టుకుంది. అయితే బాహుబలి పార్ట్ వన్ లో మాత్రం తమన్నాకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం తమన్నా చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెగ బిజీగా గడుపుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా బోలాశంకర్ అనే సినిమాలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి జోడిగా 'జైలర్' సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాని ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: