మరోసారి అలాంటి సినిమా చేయడానికి రెడీ అయిన కీర్తి సురేష్..!?

Anilkumar
టాలీవుడ్ సిటీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈమె. దాని తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకు లో హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాతో నేషనల్ అవార్డును సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తర్వాత సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ బిజీగా మారింది కీర్తి సురేష్. 


అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించే అవకాశాలను దక్కించుకుంది. ఈ భామ తెలుగుతోపాటు తమిళ భాషల్లో సైతం నటిస్తున్న ఈమె లేడీ ఓయెంటెడ్ సినిమాల్లో కూడా తన సత్తాను చాటుతోంది. కరోన లాక్ డౌన్ సమయంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఓటీడీలో సందడి చేసింది కీర్తి సురేష్. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలో కీర్తి సురేష్ కి పెద్దగా కలిసి రాలేదు అనడంలో సందేహం లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కొంచెం కూడా ఆకట్టుకోలేకపోయింది ఈమె.


మిస్ ఇండియా గుడ్ లక్ సఖి వంటి మూడు సినిమాల్లో నటించిన ఈ మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతోందని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లోకి సురేష్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతుందని తెలుస్తుంది. నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఆగస్టులో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కీర్తి సురేష్. దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: