ఆది పురుష్ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

Divya
ప్రభాస్ అభిమానులు చాలా అద్భుతంగా ఎదురు చేస్తున్న చిత్రం ఆది పురుష్.. ఇక ఇలాంటి ఎదురుచూపులకు తెరపడే క్షణాలు దగ్గర పడ్డాయి రేపటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ల సైతం ఈ సినిమా హైపుని భారీగా పెంచేశాయి.. ఆది పురుషుడి అవతారంలో ప్రభాస్ ను చూసేందుకు సైతం అభిమానులు చాలా కుర్రకలు ఊగుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ అనే యాష్ ట్యాగ్ను సైతం రెడీగా చేస్తున్నారు అభిమానులు.
ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది .ఏవైనా  పెద్ద సినిమాలు విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకోవాల వద్ద అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. చిత్ర బృందం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం టికెట్ ధరలపైన రూ.50 రూపాయల వరకు పెంచుకొని సదుపాయాన్ని కల్పించింది.ఈ పెంపు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పాటు మల్టీప్లెక్స్ లోకి కూడా వర్తిస్తుందట.
దాదాపుగా పది రోజులపాటు ఈ పెంచిన ధరలు మాత్రమే వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈరోజు నుంచి ఫ్రీ బుకింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఫ్రీ బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని బుక్ మై ట్విట్టర్ వేదికగా తెలియజేసినట్లు సమాచారం. ఈ సినిమా టికెట్లు అభిమానులు కొనడానికి మక్కువ చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం సింగిల్ థియేటర్లలో మాత్రమే ధరణి పెంచినట్లు సమాచారం. దాదాపుగా రూ .400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎక్కిస్తున్న సినిమా ఆదిపురుష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: