అల్లుశిరీష్ విషయంలో రాజమౌళి ని సంప్రదించిన స్టార్ ప్రొడ్యూసర్....!!
అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అల్లు అరవింద్ లో మనం ఆ సంతోషాన్ని గమనించొచ్చు. అయితే పెద్ద కొడుకు ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యినప్పటికీ, చిన్న కొడుకు అల్లు శిరీష్ ని హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపర్చలేకపోయానే అని అల్లు అరవింద్ లో మొదటి నుండి చాలా బాధ ఉంది. ఆయన కెరీర్ ని చక్కదిద్దడానికి అల్లు అరవింద్ చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో అతనిని లాంచ్ చేయించడానికి ప్రయత్నం చేసాడు. అందులో దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నాడు. అల్లు అరవింద్ రాజమౌళి తో 'మగధీర' లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆ చొరవతోనే మగధీర సమయం లో తన చిన్న కొడుకు అల్లు శిరీష్ తో ఒక సినిమా తియ్యల్సిందిగా కోరాడు. అదేంటి అల్లు అర్జున్ లాంటి స్టార్ కోసం అడగకుండా, అల్లు శిరీష్ కోసం అడుగుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ అల్లు అరవింద్ లెక్కే వేరు, అల్లు అర్జున్ అప్పటికే ఇండస్ట్రీ లో బాగా స్థిరపడిపోయిన హీరో, ఆయనకీ అప్పుడే రాజమౌళి తో సినిమా చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ అల్లు శిరీష్ స్థిరపడాలి అంటే కచ్చితంగా రాజమౌళి లాంటి డైరెక్టర్ కావాలి, అందుకే అడిగాడు. మగధీర చిత్రం తర్వాత ఎలాగో చిన్న సినిమా తియ్యాలి అనుకుంటున్నావు కదా, అదేదో మా శిరీష్ తో చెయ్యి అని అడిగాడట. రాజమౌళి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, కచ్చితంగా చెప్తాను అవి పూర్తి అవ్వగానే అని తప్పించుకున్నాడట. ఆ తర్వాత సునీల్ తో 'మర్యాద రామన్న' సినిమా తీసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అయినా రాజమౌళి తన కొడుకు తో సినిమా చేస్తాడు అనుకుంటే, ఆయన ఈగ సినిమా ని ప్రకటించాడు. ఇక ఆ తర్వాత బాహుబలి సిరీస్ మరియు rrr వంటి చిత్రాలు వచ్చాయి. అంత రేంజ్ కి వెళ్లిన తర్వాత ఇక అల్లు శిరీష్ తో సినిమా ఎందుకు చేస్తాడు!, అలా తన రిక్వెస్ట్ ని పట్టించుకోలేదని , అప్పటి నుండి అల్లు అరవింద్ మరియు రాజమౌళి మధ్య మాటలు లేవట.