టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన కాజల్ 2020లో తన స్నేహితుడు గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా 2021 లో పండంటి బాబుకి కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అన్న టాక్స్ సోషల్ మీడియాలో ఎంత వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే తన సోషల్ మీడియాలో
తనకి సంబంధించిన క్రేజీ ఫోటోలను షేర్ చేసి తిరిగి సినిమాల్లో నటించేందుకు నేను రెడీ అని హిట్ చేసింది.తల్లయిన తర్వాత బొద్దుగా ఉన్న కాజల్ సినిమాల కోసం మళ్లీ బక్కచ్చి తనదైన అందాలతో చాలా స్లిమ్ గా తయారైంది. అనంతరం వెబ్ సిరీస్ లతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది కాజల్. ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో సందడి చేస్తోంది.టాలీవుడ్ టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది కాజల్ .ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న కమలహాసన్ తో కలిసి నటిస్తున్న ఇండియన్ టు సినిమా షూటింగ్లో బిజీగా ఉంది కాజల్.
తెలుగులో బాలకృష్ణ కుజోడిగా భగవంత్ కేసరి సినిమాలో సైతం హీరోయిన్గా నటిస్తోంది కాజల్. అయితే తాజాగా కాజల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.తాజా సమాచారం మేరకు కాజల్ మరొకసారి తల్లి కాబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోని కాజల్ నటనకు గుడ్ బై చెప్పబోతోంది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కాజల్ ప్రస్తుతం తనకి సంబంధించిన ఫోటోలు అన్నింటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే కాజల్ నటనకు గుడ్ బై చెప్పడం అన్నది నమ్మసక్యం గా లేదు అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి..!!