శ్రీలీల పుట్టినరోజు మ్యానియా !
అయ్యాయి. ఆ రెండిటిలో ఒక సినిమా ఫ్లాప్ అయితే కేవలం ‘ధమాకా’ మాత్రమే హిట్ అయింది. ఈ ఒక్క సూపర్ హిట్ తో ఒక హీరోయిన్ కు అవకాశాలు బాగా వస్తాయి కానీ ఆమె పట్ల అటు ప్రేక్షకులలో ఇటు ఇండస్ట్రీలో మ్యానియా ఏర్పడటం ఒక్క శ్రీలీల విషయంలోనే జరిగింది.
పూజా హెగ్డే రష్మిక లాంటి టాప్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని విధంగా శ్రీలీల కు ఏర్పడిన మ్యానియా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సాధారణంగా హీరోల పుట్టినరోజునాడు అతడితో సినిమాలు తీసే నిర్మాతలు ఆ హీరోకు అభినందనలు తెలియచేస్తూ ప్రకటనలు సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేయడం పరిపాటి.
అయితే దీనికి భిన్నంగా శ్రీలీల తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు తమ సినిమాలలో ఆమె పాత్రను హైలెట్ చేస్తూ విడుదల చేసిన పోష్టర్లు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం ఆమె మహేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రామ్ వైష్ణవ్ తేజ్ ఇలా టాప్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరి సినిమాలలోను నటిస్తూ రోజుకు రెండు షిఫ్టులలో ఆమె పడుతున్న కష్టం ఏకాగ్రతను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి.
ఈమె మ్యానియా తెలుసుకుని ఆమెకు కోలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి ఆఫర్లు రావడం పరిశీలించిన వారికి ఈమె మ్యానియా మరో 5 సంవత్సరాలు కొనసాగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బష్టర్ హిట్ వస్తే చాలు ఆమె ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమెకు ఏర్పడిన మ్యానియాతో టాప్ యంగ్ హీరోలు కూడ తమ సినిమాలలో హీరోయిన్ గా శ్రీలీల కావాలి అంటూ తమ దర్శక నిర్మాతలను అడుగుతున్నారు అంటే ఆమె ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది..