OG: క్యాస్టింగ్ అదిరిపోయిందిగా... విలన్ గా ఆ స్టార్?

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓజీ’ నుంచి మరో సూపర్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి ‘ఓజీ’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’సినిమాలో కూడా విలన్గా నటిస్తున్నారు. ఇక ప్రతి నాయకుడిగా ఆయన రెండో సినిమా ‘ఓజీ’ కానుంది.ఈ మధ్యనే కోలీవుడ్ క్రేజీ యాక్టర్ అర్జున్ దాస్ను కీలక పాత్రకు ఎంపిక చేశారు. మరో ప్రముఖ తమిళ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సంవత్సరం చివర్లో కానీ, 2024 ప్రారంభంలో కానీ ఈ సినిమా విడుదల కానుందని సమాచారం తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత ఈ సినిమాకే ఇచ్చారు. ఇక ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని, మూడో షెడ్యూల్ కూడా చాలా స్పీడ్ గా సాగుతుంది. మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుందని సమాచారం తెలుస్తోంది. 2011లో వచ్చిన ‘పంజా’ తర్వాత పవన్ కళ్యాణ్ మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న కథలో నటించడం ఇదే ఫస్ట్ టైం. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.



మరోవైపు పవన్ కళ్యాణ్, క్రిష్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కూడా బాలీవుడ్ నటుడే ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నారు. బాబీ డియోల్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢీకొట్టనున్నారు. మొదట ఈ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. అందుకే అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ను తీసుకున్నారు. ఈ మూవీలో మొగలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు.పవన్ కళ్యాణ్ 'వారాహి' యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో 'ఓజీ' సహా మిగతా సినిమా షూటింగులకు బ్రేక్ వస్తుందని అంతా భావించారు. అయితే, అటువంటి సందేహాలకు పవన్ ఆయన దర్శక, నిర్మాతలు చెక్ పెట్టారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగులకు టైమ్ కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఏపీలో షూటింగులు జరగనున్నాయి. జూన్ నెల తొలి వారంలో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులు షూటింగ్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OG

సంబంధిత వార్తలు: