తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటు వంటి రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు సినిమాల్లో కామెడీ పాత్రలతో పాటు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా తాజాగా ఈ నటుడు ఇంటింటి రామాయణం అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో తెలుగు సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నవ్య స్వామి హీరోయిన్ గా నటించింది.
నరేష్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న గంగవ్వ ... అంజి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 23 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.