ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా పేరు ఇప్పుడు ఎక్కడవిన్నా తెగ మారి మారుమోగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 7000 కి పైగా థియేటర్స్ లలో ఈ సినిమా విడుదలైంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు సినీ క్రిటిక్స్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ కి ఫిదా అవుతున్నారు ఆడియన్స్.
అయితే విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేసింది. అత్యధిక థియేటర్స్లలో విడుదలైన రికార్డును సాధించింది ఆది పురుష్ సినిమా.అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఈ సినిమా రెండవ స్థానంలో ఉంది.ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో లో ఎరికార్డును దక్కించుకుంది ఆది పురుష్ సినిమా. ఇక ఈ ప్లాట్ఫారంలో పది లక్షల మంది ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు ఈ యాప్ లో ఇప్పటివరకు 1.75 మిలియన్ ఇంట్రెస్ట్ తో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది.
తాజాగా ఇప్పుడు వన్ మిలియన్ లైక్స్ తో ఆది పురుష్ సినిమా రెండవ స్థానంలో నిలిచింది. తాజాగా ఇప్పుడు ఆది పురుష్ సినిమా టికెట్ల విషయంలో పాత రికార్డులను సైతం బద్దలు కొట్టింది. సౌత్ ఇండియా తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ లో దూసుకుపోతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఆది పురుష్ సినిమాకి సెలబ్రిటీ నుండి మద్దతు కూడా లభిస్తుంది. అంతేకాదు ఈ సినిమా మంచి హిట్ కావాలంటూ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ..!!