అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం సమంతకి 36 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చిన సమంత మళ్ళీ పెళ్లి చేసుకోలేదు .అయితే మరోవైపు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారు అన్న కథనాలు ఏ రేంజ్ లో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి సంబంధించిన ఆధారాలు సైతం బయటికి వచ్చాయి. అయితే లండన్ లో నాగచైతన్య శోభిత జంటగా చెక్కలు కొడుతూ చాలాసార్లు కెమెరా కంటికి చిక్కారు. ఈ క్రమంలోనే చాలాసార్లు నాగచైతన్య టీమ్ ఈ వార్తలను చాలాసార్లు ఖండించారు.
కానీ ఏదో ఒక రోజు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాము అన్న ప్రకటన చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోని సమంత కూడా తనకు ఒక తోడు కావాలని వెతుక్కుంటుంది అని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం సమంత హీరో వరుణ్ ధావన్ తో ప్రేమలో పడిందని అంటున్నారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారని అంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరు జంటగా సితడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
ఇక ఈ సిరీస్ తోనే వరుణ్ ధావన్ సుమంత్ కి దగ్గర అయ్యారు అని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు .కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల వరుణ్ ధావన్ భార్యా నటాషా తో విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ 2021లో పెళ్లి చేసుకున్నారు. వరుణ్ భార్య ఫ్యాషన్ డిజైనర్ కాగా ఏళ్ల తరబడి వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం సమంత సెటాడేల్ తో పాటు ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా శివ నిర్వనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది..!!