బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మువీ ఆదిపురుష్. శుక్రవారం నాడు (జూన్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మన ఇతిహాస రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మువీలో రాముడిగా ప్రభాస్ గా సీతగా కృతి సనన్ నటించారు.ఇక ఫస్ట్ డే థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మొదటి రోజు షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయంటే ఆదిపురుష్ ఖచ్చితంగా రికార్డులు తిరగరాసేలా ఉంది. గత ఏడాది విడుదల చేసిన ఈ మువీ టీజర్ వల్ల చాలా విమర్శలు చేశారు.ఇది చిన్నపిల్లల యానిమేషన్ లా ఉందని, అసలు థియేటర్లకు వచ్చి ఎవరైనా చూస్తారా అంటూ చాలా ఘోరంగా ట్రోల్స్ చేశారు.అయితే కొద్ది రోజుల క్రితం ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ విమర్శలన్నీ కూడా దెబ్బకు పటాపంచలైపోయాయి. అభిమానుల్లో ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతటా ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ప్రీమియర్ షోలు కూడా పూర్తవడంతోనే ఇప్పటికే ఈ సినిమాపై రివ్యూలు కూడా వచ్చేశాయి. ఈ సినిమాని చూసిన కొందరు బాగుందంటే, మరికొందరేమో అచ్చం పిల్లల బొమ్మల లా చూపించారంటూ పెదవి విరుస్తున్నారు.
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా బాహుబలిలో ప్రభాస్ రాజు గెటప్‌లో చాలా రాయల్‌గా కనిపించిన విషయం తెలిసిందే. తాజా మువీ ఆదిపురుష్‌లో ప్రభాస్‌కు రాముడి వేషం సెట్ కాలేదని కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఆదిపురుష్ సినిమా చూసిన ఓ వ్యక్తి బాలేదంటూ పలు యూట్యూబ్ ఛానళ్లకు కెమెరా ముందూ రివ్యూ చెప్పాడు.దీంతో అక్కడున్న ప్రభాస్ అభిమానులు అతనిని ఐమ్యాక్స్ థియేటర్ వద్దే చితక్కొట్టారు.ఆచార్య మూవీలో గ్రాఫిక్స్ మధ్య చిరంజీవిని ఏవిధంగా చూపించారో.. ఆదిపురుష్ మూవీలో కూడా ప్రభాస్‌ను థ్రీడీలో చూపించారని, ప్లే స్టేషన్లో కనిపించే రాక్షసుల్ని దించేశారని, హనుమంతుడు ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ తప్ప సినిమాలో మరేం బాలేదని చెప్తుండగా మధ్యలోనే ప్రభాస్ ఫ్యాన్స్ అతడిపై బాగా ఫైర్ అయ్యారు.ఏం చూసి రివ్యూ చెప్తున్నావంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. తరువాత ఆ వ్యక్తిపై దాడి చేసి చితక్కొట్టారు. ఇక చుట్టుపక్కలవారు అడ్డుకోవడంతో గొడవ సర్దుమనిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.