టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్గా నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈమె. ఇక ఆ సినిమా నెగిటివ్ టాక్ చేసుకున్నప్పటికీ ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి .ఇక దానికి ముఖ్య కారణం శ్రీ లీల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక యూత్ లో భారీ క్రేజ్ ను తెచ్చుకున్న ఈమె ఆ క్రేజ్ కారణంగానే ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుంటుంది.
ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో ఆఫర్లతో బిజీగా ఉన్నా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లామర్ రోల్ అయినా ట్రెడిషనల్ అయినా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈమె. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలు సీనియర్ హీరోలు యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ హీరోయిన్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చిత్రాంగదా అనే సినిమాలో నటించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం శ్రీ లీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందన్న వార్త తెలియడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తను చెల్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధుతులాని చిన్నప్పుడు పాత్రలో కనిపించింది ఈమె. ఇకపోతే ప్రస్తుతం ఈమె భారీ రెమ్యూనికేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక ప్రేక్షకుల్లో ఆమెకి ఉన్న క్రేజ్ కారణంగా ఆమె అడిగినంత రెమ్యూనికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల నుండి కూడా ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న క్రమంలో ఇతర ఇండస్ట్రీ నుండి వస్తున్న ఆఫర్లను చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది అని తెలుస్తుంది..!!