ఆ హీరోయిన్ ని బాగా ఇబ్బంది పెట్టిన లారెన్స్....!!
ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే టైంలో నిక్కీ గల్రాని ఓసారి షూటింగ్ సెట్ కి ఆలస్యంగా వచ్చిందట. దాంతో రాఘవ లారెన్స్ కి చాలా కోపం వచ్చిందట. కానీ ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక ఒక పెద్ద రూమ్ లో డ్యాన్స్ షాట్ ని ఎలాంటి కట్స్ చేయకుండా చేయమని నిక్కీ గల్రానికి చెప్పారట.అయితే ఈ షార్ట్ ఎన్నిసార్లు చేసినా కూడా నిక్కీ గల్రాని చేయలేక పోయిందట.అయితే ఈ లాంగ్ డాన్స్ షాట్ చేయడానికి సాయంత్రం అయిపోయిన కూడా నిక్కి గల్రాని ఆ షార్ట్ పూర్తి చేయలేక పోయిందట.దాంతో నిక్కీ గల్రాని తన తప్పు తెలుసుకుని లారెన్స్ దగ్గరికి వెళ్లి క్షమించమని కన్నీళ్లు పెట్టుకుందట.దాంతో రాఘవ లారెన్స్ కరిగిపోయి ఇంకోసారి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు అని ఆ డాన్స్ షాట్ ని నాలుగు కట్స్ చేసి కేవలం గంట లోనే ఆ డ్యాన్స్ ని పూర్తి చేయించారట. అయితే అప్పట్లో రాఘవ లారెన్స్ చేసిన పనిని కొంతమంది మెచ్చుకుంటే మరి కొంతమంది విమర్శించారు.