అలాంటి డెసిషన్ తీసుకున్న త్రిష....!!

murali krishna
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి త్రిషకు కొంత కాలం పాటు కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ ఈమె ప్రస్తుతం హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా మారిపోయారు.తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో త్రిషకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన త్రిషకు ఇప్పటికి హీరోయిన్గా అవకాశాలు రావడం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇలా ఈమెకు ప్రస్తుతం వరుస అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ విధంగా కెరియర్ బిజీ అవుతున్న సమయంలో త్రిష ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ చిత్రం బ్రో డాడీ .ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో చిరంజీవికి జోడిగా త్రిష నటించిన బోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో పృధ్విరాజ్ తల్లిదండ్రులుగా సీనియర్ నటుడు మోహన్ లాల్, మీనా తల్లిదండ్రులకు నటించారు. ఈ క్రమంలోనే ఈ రీమేక్ చిత్రంలో చిరంజీవి త్రిష తల్లిదండ్రులుగా కనిపించబోతున్నారని ఇందులో వీరి కొడుకు పాత్రలో యంగ్ హీరో డీజే టిల్లు త్రిష కొడుకు పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా సిద్దు జొన్నలగడ్డకు ఈమె తల్లిగా నటించబోతున్నారని వార్తలు రావడంతో ఈ విషయంపై త్రిష అభిమానులు స్పందిస్తూ త్రిష ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: