తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో నిఖిల్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన సినిమా లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ నటుడు కార్తికేయ 2 అనే పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో కార్తికేయ 2 మూవీ తో పాటు 18 పేజెస్ అనే మరో మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి గర్రి బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు.