అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి లక్ష్మీ కళ్యాణం అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత చందమామ మూవీ తో మంచి కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మగధీర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ని అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. మగధీర మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి నటించిన సినిమాలు కూడా చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ నటి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ కథానాయకిగా కెరీర్ ను కొనసాగించింది.
ప్రస్తుతం కాజల్ తెలుగు లో బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న భగవంతు కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. తమిళ్ లో ఈ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ 60 వ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ఈవెంట్ ను ఈ మూవీ బృందం సినీ ఫ్లెక్స్ ... బంజారా హిల్స్ లో జూన్ 18 వ తేదీన సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.