ప్రముఖ టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా లేకపోయినా అడపాదడపా ఆఫర్లు అయితే చేతిలో ఉన్నాయి. తాజాగా ఒక షోకు హాజరైన వరుణ్ సందేశ్ తన భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పడ్డానండి ప్రేమలో మరి సినిమా కోసం వితికతో కలిసి పని చేశానని కథ వినడానికి వెళ్లిన సమయంలో వితికను తొలిసారి చూశానని వరుణ్ అన్నారు. తను మాత్రం కొత్త బంగారు లోకం షూట్ సమయంలోనే నన్ను చూసిందని వరుణ్ చెప్పుకొచ్చారు. ఒక సీన్ లో వితికను కింద పడేయగా వితికకు తీవ్రమైన నడుము నొప్పి వచ్చిందని వరుణ్ తెలిపారు. మొదట వితికకు పొగరని అనుకున్నానని తర్వాత తను ఫ్రెండ్లీ అని అనిపించిందని వరుణ్ సందేశ్ తెలిపారు. మలేషియాకు వెళ్లిన సమయంలో వితికతో ప్రేమలో పడ్డానని వరుణ్ అన్నారు. నా గతం గురించి కూడా వితికకు చెప్పానని వరుణ్ సందేశ్ వెల్లడించారు. మేము ప్రపోజ్ చేసుకున్న తర్వాత వితిక మా ఇంట్లో వాళ్లతో మాట్లాడేదని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నేను కుటుంబ సభ్యులతో కలిసి వేగాస్ కు వెళ్లగా అక్కడికి వితిక వచ్చి సర్రైజ్ చేసిందని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. వితిక సర్ప్రైజ్ లను ఎక్కువగా ప్లాన్ చేస్తుందని వరుణ్ సందేశ్ వెల్లడించారు. నాకోసం వితిక హలాల్ గయ్స్ అనే వంటకం నేర్చుకుని చేసిపెట్టిందని వరుణ్ సందేశ్ అన్నారు. మా మధ్య ఎలాంటి చర్చలు జరిగినా నాన్నకు ఫస్ట్ కాల్ వెళుతుందని అంతకు మించి ఎలాంటి కంప్లైంట్స్ లేవని వరుణ్ సందేశ్ తెలిపారు. వితిక తరచూ నా బ్రష్ ను వాడుతుందని అలా చేయడం అస్సలు నచ్చదని వరుణ్ సందేశ్ అన్నారు. గతంలో నాకు సంబంధించిన ఒక వీడియోను వితిక షేర్ చేసిందని ఆ వీడియో మరీ టూ మచ్ అని వరుణ్ సందేశ్ అని వెల్లడించారు. వితికపై కోపంతో ఒకసారి మైక్రో వేవ్ ను పగలగొట్టానని వరుణ్ సందేశ్ అన్నారు.